Surprise Me!

Hyderabad Metro First Day Journey : Women Loco Pilots For Metro | Oneindia Telugu

2017-11-29 15 Dailymotion

Hyderabad people getting most excitment for first day journey in Metro train. apart from that It was a woman loco pilot of the newly inaugurated Hyderabad Metro Rail who got to take the first passenger Prime Minister Narendra Modi for a ride <br /> <br />నగరంలో మొదలైన మొదటి 'మెట్రో రైలు'ను నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సుప్రియా సనమ్‌ నడిపారు.. భాగ్యనగర ప్రజల కలల ప్రాజెక్ట్‌ అయిన మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభం అనంతరం ప్రధాని మోడీ కూడా ఈ మెట్రోరైలు ఎక్కి మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ ప్రయాణించారు. తిరిగి అదే రైలులో ఆయన మియాపూర్‌కు చేరుకున్నారు. సుప్రియతో పాటు మరో ముగ్గురు మహిళా డ్రైవర్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఉన్నారు. వీరిలో వరంగల్‌కు చెందిన కె.సింధుజ, మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌ మండలం బలిజపేటకు చెందిన బి.వెన్నెల, హైదరాబాద్‌కు చెందిన జి.ప్రణయ ఉన్నారు. <br />ఇక బుధవారం నుంచి మెట్రో సేవలు సామాన్యులకు అందుబాటులోకి రావడంతో తెల్లవారుజాము నుంచే ఆయా స్టేషన్ల వద్ద రద్దీ కనిపించింది. తొలిసారిగా మెట్రో రైల్లో ప్రయాణం కోసం నగర ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో మొదటి రోజు రద్దీ ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

Buy Now on CodeCanyon